బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి –

Homeతెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి –

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి – సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా

ఉపాధి కూలీల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి –

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో నిర్వహించిన సిపిఐ పార్టీ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను నెలకు రూ.2,016 నుంచి రూ.4,000కు, వికలాంగుల పింఛన్లను రూ.4,016 నుంచి రూ.6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పింఛన్ల పెంపు హామీని తక్షణమే అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రమేష్, బి. సుధాకర్, వెంకటేష్, రాందాస్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: