బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

​పత్రికా ప్రకటన ​రోస్టర్ సవరణ జరిగే వరకు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను తక్షణమే నిలిపివేయాలి

Homeతెలంగాణ

​పత్రికా ప్రకటన ​రోస్టర్ సవరణ జరిగే వరకు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను తక్షణమే నిలిపివేయాలి

​పత్రికా ప్రకటన ​రోస్టర్ సవరణ జరిగే వరకు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను తక్షణమే నిలిపివేయాలి – మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏస

*టీజీస్పడీసీల్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కు వినతి* *గుబ్బల లక్ష్మి నారాయణ*
MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు
*ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత నిబంధనలు పాటించాలి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున*

​పత్రికా ప్రకటన
​రోస్టర్ సవరణ జరిగే వరకు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను తక్షణమే నిలిపివేయాలి
– మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ డిమాండ్
– ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పణ
​హైదరాబాద్:
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలలో చేపడుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల ఎస్సీ వర్గాల్లోని మెజారిటీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ రోస్టర్‌ను వెంటనే సవరించే వరకు నియామకాలను నిలిపివేయాలని మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ డిమాండ్ చేశాయి.
​మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధుల బృందం మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డిని కలిసి ఈ మేరకు సమగ్రమైన వినతిపత్రాన్ని అందజేసింది.
​ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ, ప్రస్తుత 20 నియామక నోటిఫికేషన్లలో అమలు చేస్తున్న రోస్టర్ పద్ధతి వల్ల ఎస్సీ జాబితాలో ఉన్న మెజారిటీ కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు:
​గ్రూప్-3లోని 26 కులాలకు,
​గ్రూప్-1లోని 15 కులాలకు,
​గ్రూప్-2లోని 17 కులాలకు
​మొత్తంగా 58 కులాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని, ఎదుర్కొంటున్న అసమానతలను ఆధారాలతో సహా ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు వివరించినట్లు తెలిపారు.
​ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి:
ఈ తీవ్రమైన సమస్యను గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దృష్టికి, అలాగే రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తక్షణమే తీసుకెళ్లాలని జేఏసీ నేతలు చైర్మన్‌ను కోరారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో (VCs) అత్యవసరంగా మాట్లాడి, బాధితులైన ఈ 58 కులాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా ఉన్నత విద్యామండలి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. సవరించిన వర్గీకరణ/రోస్టర్ విధానం అమల్లోకి వచ్చే వరకు నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని స్పష్టం చేశారు.
​ఈ కార్యక్రమంలో జేఏసీ ముఖ్య నేతలు:
​సేపురి ప్రణయ్ కుమార్ (వైస్ చైర్మన్)
​మాదాసు రాహుల్ (మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్)
​బత్తుల దిలీప్ (కన్వీనర్, ఓయూ ప్రెసిడెంట్)
​దాసరి రవి
​నీలం ప్రవీణ్
​బూర్గుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
​ఇట్లు,
మాల సంఘాల జేఏసీ & మాల స్టూడెంట్ జేఏసీ
హైదరాబాద్.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0