బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తుఫాన్ బాధితులకు అండగా మేమున్నాం

Homeతెలంగాణ

తుఫాన్ బాధితులకు అండగా మేమున్నాం

తుఫాన్ బాధితులకు అండగా మేమున్నాం ఉప్పాడలో మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ యు కొత్తపల్లి మండలం తుఫాన్ నష్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుత

సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్
మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో
నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు

తుఫాన్ బాధితులకు అండగా మేమున్నాం

ఉప్పాడలో మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

యు కొత్తపల్లి మండలం

తుఫాన్ నష్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉప్పాడ, పెద్ద బజార్ గాంధీ బొమ్మ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులు మరియు ఉప్పాడ శివారు పల్లిపేట మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి హైదరాబాదు నుండి తెలుగు సినీ దర్శకులు శైలేష్ కొలను వారి ఆర్థిక సహాయంతో హైదరాబాద్‌కు చెందిన నాగిరెడ్డి ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మొన్న తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు తన వంతుగా సినీ దర్శకులు కష్టకాలంలో ఉన్న వారికి ఆయన ముందుకు వచ్చి తను వంతుగా ఆర్థిక సహాయం వెయ్యి రూపాయలు విలువచేసే వెయ్యి మందికి నిత్యవసర వస్తువులు పంపిణీ నాగిరెడ్డి ఆర్గనైజేషన్ ద్వారా అందజేశారు.
ఇటీవల సంభవించిన తీవ్ర తుఫాన్ కారణంగా సర్వస్వం కోల్పోయి అల్లాడుతున్న మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచారు.

కన్నీటి తీరంలో మానవతా వెల్లువ:

సముద్రం అల్లకల్లోలంగా మారి ఇళ్లు, జీవనోపాధి దెబ్బతిని తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న మత్స్యకారులను గుర్తించి ఈ సాయం అందించారు. ప్రతి కిట్‌. లబ్ధిదారులకు నేరుగా ఈ వస్తువులను అందజేస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు.బాధితులకు భరోసా:
ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధులు మరియు సినీ దర్శకులు మాట్లాడుతూ.. “తుఫాన్ సృష్టించిన బీభత్సం వల్ల తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కష్టకాలంలో వారికి తోడుగా నిలవడం మనందరి బాధ్యత. మా వంతు చిన్న ప్రయత్నంగా సోమవారం నాడు మాయ పట్నం గ్రామంలోనూ మంగళవారం పల్లి పేట వద్ద ఈ నిత్యవసరాలను అందజేస్తున్నాం” అని తెలిపారు.సకాలంలో స్పందించి తమను ఆదుకోవడానికి హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చిన సినీ దర్శకులు శైలేష్ కొలను మరియు నాగిరెడ్డి ఆర్గనైజేషన్‌కు ఉప్పాడ, పల్లిపేట గ్రామస్థులు మత్స్యకార సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మానవతా కార్యక్రమం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో తుఫాన్ బాధితులు ఆర్గనైజేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: