బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు

Homeతెలంగాణ

గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు

గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి పలువురు జనసేనలోకి.. తొండంగి, నవంబరు 3: తొండంగి మండలం గొర్సపాలం గ్ర

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం..
బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం

గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు

యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి పలువురు జనసేనలోకి..

తొండంగి, నవంబరు 3: తొండంగి మండలం గొర్సపాలం గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు ఆదేశాల మేరకు గొర్సపాలానికి చెందిన యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నాయకులు నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలు గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ విధానాలు, నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు జనసేనలో చేరే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంతో గొర్సపాలంలో జనసేన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: