ఉపాధి కూలీల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నమస్తే భారత్ :-తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారు ఈదుల కుంట తండ గ్రామపంచాయతీలో బుధవారం ఉపాధి కూలీలు స్థాన
ఉపాధి కూలీల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
నమస్తే భారత్ :-తొర్రూరు
మండలంలోని వెలికట్ట శివారు ఈదుల కుంట తండ గ్రామపంచాయతీలో బుధవారం ఉపాధి కూలీలు స్థానిక సర్పంచ్ బానోత్ రజిని వెంకన్న,తొర్రూరు ఎంపిఓ ఎండి. అరీఫ్ హుస్సేన్ లతో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మ పీర్చిన ఐదుగురికి చీరలు బహుకరించారు. మొదటి బహుమతి నవ్య శ్రీ, 2వ బహుమతి వినోద,3వ బహుమతి దివ్యశ్రీ,4వ బహుమతి పద్మ,5వ బహుమతి వినోదలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని సంప్రదాయ పండుగలన్నింటిలో ప్రత్యేకమైనదని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పెంతాల ఉపేందర్, వార్డు సభ్యులు గుగులోతు ధ్వలి, మాలోత్ పద్మ శ్రీను, వినోద, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS