బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత నిబంధనలు పాటించాలి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున*

Homeతెలంగాణ

*ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత నిబంధనలు పాటించాలి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున*

*ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత నిబంధనలు పాటించాలి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున* *48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు*

నూతన కరెంటు పోల్‌కు వీధి లైట్ ఏర్పాటు
*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*
కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం

*ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత నిబంధనలు పాటించాలి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున*

*48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు*

తుగ్గలి, నవంబర్ 3 ( నమస్తే భరత్ ):

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పత్తికొండ రూరల్ సర్కిల్ సీఐ పర్యవేక్షణలో జొన్నగిరి ఎస్‌ఐ, ఎన్, సి ,మల్లికార్జున పోలీస్ సిబ్బంది జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పగిడిరాయి, పి. కొత్తూరు, ఉప్పర్లపల్లి, వై.జి. తండా, బాట తండా, కడమకుంట్ల, రోళ్లపాడు తండా గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిబంధనలను వివరించారు. ఎన్నికల ప్రచారం నిర్ణీత గడువు అయిన సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

*ప్రచారంపై ఆంక్షలు.. నిబంధనలు తప్పనిసరి*

తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని, ర్యాలీలు, మైక్ ప్రచారం, బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని జొన్నగిరి పోలీసులు విజ్ఞప్తి చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: