బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మారథాన్‌లో రాణించిన షాద్‌నగర్ వాసి..

Home.

మారథాన్‌లో రాణించిన షాద్‌నగర్ వాసి..

మారథాన్‌లో రాణించిన షాద్‌నగర్ వాసి.. తల్లిదండ్రులకు, చిన్నారులకు స్ఫూర్తిగా కేపీ శ్రీనివాసరావు న్యూ పవర్ కుంగ్‌ఫూ మాస్టర్లు బాలరాజ్, అహ్మద్ ఖాన్

మొక్కలను నాటి సంరక్షించుకుందాం.. -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి..
నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు!
సందీప్. అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మి గౌడ్.

మారథాన్‌లో రాణించిన షాద్‌నగర్ వాసి..

తల్లిదండ్రులకు, చిన్నారులకు స్ఫూర్తిగా కేపీ శ్రీనివాసరావు

న్యూ పవర్ కుంగ్‌ఫూ మాస్టర్లు బాలరాజ్, అహ్మద్ ఖాన్ అభినందనలు

నమస్తే భారత్ షాద్‌నగర్, అక్టోబర్ 24,: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టైమ్స్ ఇంటర్నెట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్‌–2026లో షాద్‌నగర్‌కు చెందిన కేపీ శ్రీనివాసరావు ప్రతిభ కనబరిచారు. ఈ మారథాన్‌లో భాగంగా నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగును 39 నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యూ పవర్ కుంగ్‌ఫూ మాస్టర్లు బాలరాజ్, అహ్మద్ ఖాన్ లు శ్రీనివాసరావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీనివాసరావు పిల్లలు తన వద్ద కరాటే శిక్షణ పొందుతున్నారని, వారి తండ్రి మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా పరుగును పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఒక పేరెంట్‌గా శ్రీనివాసరావు క్రీడల పట్ల చూపిన ఆసక్తి, పట్టుదల ఇతర తల్లిదండ్రులకు, చిన్నారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడంతో పాటు తల్లిదండ్రులు సైతం ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మాస్టర్లు బాలరాజు, అహ్మద్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: