బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సందీప్. అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసిన  మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మి గౌడ్.

Homeతెలంగాణ.

సందీప్. అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మి గౌడ్.

సందీప్. అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ

ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ
మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

సందీప్. అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసిన

మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మి గౌడ్.

నమస్తే భారత్ :-కేసముద్రం

కేసముద్రం మండల పరిధిలోని అర్పణపల్లి గ్రామానికి చెందిన సందీప్ బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడుకక్కడే మృతి చెందగా,సందీప్ భార్య భవాని పరిస్థితి విషమంగా ఉంది..ఖమ్మం హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతుంది..సందీప్ మరణం తో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.​శుక్రవారం నాడు మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి సందీప్ నివాసానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సందీప్ అంత్యక్రియలు నిర్వహించగా… మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మి గౌడ్ హాజరై పాడె మోశారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఉండి సందీప్ కుటుంబానికి ధైర్యం చెప్పారు .​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… సందీప్‌కు వివాహమై కేవలం రెండు నెలలే అవుతోందని, దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఉప్పరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సందీప్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. సందీప్ తక్కువ సమయం లో అందరి దగ్గర మంచి మన్ననలు పొందాడని,తన మరణం మాకు ఎంతోకలంగా కలిసి ఉన్న ఆప్తుడిని కోల్పోయినట్టు ఉందని,పండుగ రోజు మమ్మల్ని కన్నీటి శ్లోకం లో పడేసినట్టు అయ్యిందని విచారణ వ్యక్తం చేశారు ..సందీప్ కుటుంబానికి కాంగ్రెస్ మండల పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,మాజీ PACS చైర్మన్ బండారు వెంకన్న, సర్పంచ్ కుమారస్వామి,చిన్న వెంకన్న, వల్లందాసు రవి, తరాల వీరేష్, కమకుటం శ్రీనివాస్,మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి రవీందర్,తండ సంపత్,బిర్రు వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: