బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు!

Home.

నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు!

నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు! నమస్తే భారత్:-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మూడో వార్డులో గత న

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు!

నమస్తే భారత్:-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మూడో వార్డులో గత నెల రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కాలనీ మొత్తం చీకటిమయంగా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.చీకటి కారణంగా కాలనీలో పాములు, తేళ్లు, ఇతర విషపూరిత పురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.గత నెల రోజులుగా సమస్య ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి, మరమ్మతులు చేపట్టి మూడో వార్డులోని అన్ని వీధి దీపాలను ఏర్పాటు చేసి వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: