బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్న

Homeతెలంగాణ

సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్న

సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్న ఖానాపురం, అక్టోబర్ 19 (మల్లేష్ ,నమస్తే భారత్ ): గ్రామపంచాయతీ అభివృద్ధిలో నిరంతరం సేవలం

పాఖాల అందాలను వీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదును చేసుకోవాలి
ధర్మారావుపేట శివాలయం, రామాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్న

ఖానాపురం, అక్టోబర్ 19 (మల్లేష్ ,నమస్తే భారత్ ):

గ్రామపంచాయతీ అభివృద్ధిలో నిరంతరం సేవలందిస్తున్న సిబ్బంది సేవలను గుర్తించి సర్పంచుల ఫోరం ఖానాపురం మండల అధ్యక్షుడు ,ధర్మరావుపేట గ్రామ సర్పంచ్ మాడ్రాజు వెంకన్న తన ఉదారతను చాటుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బందికి నూతన దుస్తులతో పాటు పండుగ ఖర్చుల నిమిత్తం నగదును తన సొంత ఖర్చులతో అందజేశారు.

ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి పండుగ వేళ దుస్తులు, నగదు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తమను ప్రోత్సహించిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ను సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి అనిత, ఉపసర్పంచ్ కొనుకటి రాజు, వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, మోహన్, కరోబార్ అనిల్, వేద పండితుడు అన్వేష్ శాస్త్రి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0