బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పాఖాల అందాలను వీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Homeతెలంగాణ.

పాఖాల అందాలను వీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

పాఖాల అందాలను వీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఖానాపురం, అక్టోబర్ 21 ( మల్లేష్ నమస్తే భారత్): పాఖాల సరస్సు పరిసర ప్రాంతాలను జిల్లా కలెక

వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

పాఖాల అందాలను వీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఖానాపురం, అక్టోబర్ 21 ( మల్లేష్ నమస్తే భారత్):

పాఖాల సరస్సు పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి సరస్సు అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా సరస్సు పరిసరాల్లోని హెర్బల్ గార్డెన్, చిలకల బుట్టను సందర్శించారు. అనంతరం వాచ్‌టవర్‌పై నుంచి సరస్సు అందాలను తిలకించారు.
తదుపరి అటవీశాఖ అధికారులతో సరస్సు పరిసర ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకుల సంఖ్య పెంపు, వలస పక్షుల సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. పాకాల సరస్సుకు వచ్చే వివిధ రకాల వలస పక్షుల విశేషాలను పర్యాటకులు, ప్రజలు, రైతులకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సరస్సు ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేలా సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ నరేష్, ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: