పాల్వంచ పెద్దమ్మ తల్లిని దర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నమస్తే భారత్:-మరిపెడ పాల్వంచలోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆదివారం మరిపెడ మున్సి
పాల్వంచ పెద్దమ్మ తల్లిని దర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్
నమస్తే భారత్:-మరిపెడ
పాల్వంచలోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆదివారం మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆమె, భక్తులకు అవసరమైన వసతులపై సంబంధిత వారితో మాట్లాడారు. అనంతరం ఆలయ అర్చకులతో మాట్లాడి ఆలయ విశేషాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అలవాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS