బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తాతా మధుపై చర్యలు తీసుకోవాలి – శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలి

Homeతెలంగాణ

తాతా మధుపై చర్యలు తీసుకోవాలి – శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలి

తాతా మధుపై చర్యలు తీసుకోవాలి – శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ దళిత జాతిని హేళన చేస్తున్న బిఆర్ఎస

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ
పోతుల కాంతమ్మ మృతి.. కుటుంబ సభ్యులకు పరామర్శ తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

తాతా మధుపై చర్యలు తీసుకోవాలి – శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్

దళిత జాతిని హేళన చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ – కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు

కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన

నమస్తే భారత్ :-కేసముద్రం

​తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఆక్షేపమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును శాసన మండలి సభ్యత్వాని నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని కేసముద్రం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సమ్మిగౌడ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. ​కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన నిర్వహించారు.​​ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్పీకర్ పదవికి, దళిత సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడటం రాజ్యాంగ విలువలను తీవ్రంగా అవమానించడమేనని నినాదాలు చేశారు.అనంతరం సీనియర్ నాయకులు మాట్లాడుతూ…తాతామధును వెంటనే శాసనమండలి నుండి భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ మాట్లాడుతూ.​ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన తీరు అత్యంత హేయమైనదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్య పద్ధతులను కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. తాతా మధుపై తక్షణమే అనర్హత వేటు వేసి, శాసన మండలి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.”
​ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ స్థానానికి ప్రత్యేక గౌరవం ఉంటుందని, అలాంటి పదవిలో ఉన్న దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవికి తాతా మధు అనర్హుడని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు,రావుల మురళి, బండారు వెంకన్న, కదిర సురేందర్, వల్లందాసు రవి, తరాల వీరేష్,రాంబాబు,రడెం వెంకన్న,రడెం.శ్రీనివాస్,పోలెపాక నాగరాజు, ఆయూబ్ ఖాన్, శ్రీహరి, దామరకోండ ప్రవీణ్,సామల నరసయ్య,కొలిపాక వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచ్ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: