మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్ లో వైద్యశిబిరం ఖానాపురం ,సెప్టెంబర్ 8 (నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం బుధరావుపేట సబ్ సెంటర్ పరిధి వజీనేపల
మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్ లో వైద్యశిబిరం
ఖానాపురం ,సెప్టెంబర్ 8 (నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలం బుధరావుపేట సబ్ సెంటర్ పరిధి వజీనేపల్లిలోని (నెక్కొండ) మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర
వైద్య అధికారి డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
స్కూల్ పిల్లలకు వైద్య పరీక్షలు చేసి సాధారణ జలుబు, దగ్గు, స్కిన్,
ఎలర్జీ ఇతర ఆరోగ్య సమస్యలకు,జ్వరం ఉన్నవారికి ఆర్ డీటీ కిట్స్ ద్వారా టెస్టులు నిర్వహించి
మందులు అందజేశారు.
ఈ సందర్భంగావైద్యాధికారి డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ
14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరం లోపు అమ్మాయిలు హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు.10 సంవత్సరాలు మరియు 16 సంవత్సరాలు నిండిన వారికి టిడి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటీంచాలన్నారు.ప్రతిరోజుతినే ముందు తిన్న తర్వాత
బాత్రూం యూస్ చేసిన తర్వాత సబ్బుతో హ్యాండ్ వాష్ చేసుకోవాలని సూచించారు. పరిసరాల
అపరిశుభ్రత వల్ల
దోమలు, ఈగలు చేరుతాయని వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని
తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు ఆరోగ్య విద్య బోధించారు.
ముఖ్యంగాదోమల వల్ల
మలేరియా, డెంగ్యూ ,చికెన్ గున్యా, ఫైలేరియా,
మెదడు వాపు లాంటి వ్యాధులు వస్తాయన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆహారం, నీరు కలుషితం వల్ల టైఫాయిడ్ ,జాండీస్, వాంతులు ,విరేచనాలు వస్తాయన్నారు.వేడి వేడిఆహారం,పరిశుభ్రమైన నీరు, తీసుకోవడం వల్ల
మరియు వ్యక్తిగత పరిశుభ్రత , పరిసరాల పరిశుభ్రత వలన ఎలాంటి వ్యాధులు దరిచేరవని తెలియజేశారు.ఈకార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్
దామోదర్ రెడ్డి !హెల్త్ అసిస్టెంట్ లుభాస్కర్,
జ్యోతి ఆశా భవానీ ,స్కూల్
నర్సింగ్ ఆఫీసర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

COMMENTS