బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడలో మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్ ప్రారంభించిన  మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

Homeతెలంగాణ

మరిపెడలో మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్ ప్రారంభించిన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మరిపెడలో మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్ ప్రారంభించిన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపె

*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*
మార్కెట్‌యార్డులో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం
మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు – 12వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన

మరిపెడలో మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్ ప్రారంభించిన

మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ పట్టణానికి చెందిన ఆదూరి అశోక్ నూతనంగా ఏర్పాటు చేసిన “మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్” సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మరిపెడ పోలీస్ స్టేషన్ గల్లీ పక్కన మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ నూతన టీ, కాఫీ & జ్యూస్ సెంటర్‌ను మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం.అభినందనీయమన్నారు. వినియోగదారులకు నాణ్యమైన టీ, కాఫీ, జ్యూస్‌తో పాటు మంచి సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆదూరి అశోక్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.నూతనంగా ప్రారంభమైన ఈ సెంటర్‌లో బెల్లం టీ, కాఫీతో పాటు వివిధ రకాల జ్యూస్‌లు అందుబాటులో.ఉండనున్నాయిమెయిన్ రోడ్డుపై సౌకర్యవంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు సైతం ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీసీసీ నియోజకవర్గ అబ్జర్వర్ అవీజ్ ఖాన్, కౌన్సిలర్లు మెరుగు రాము, పానుగోతు రాములు, జాటోతు సురేష్, గంట్ల గౌతమ్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, గంధసిరి భిక్షపతి, కరణ్ సింగ్, లచ్చిరాం, యాకుబ్ జానీ, రామగిరి సత్యనారాయణ, గుంటి రవి, బంక ప్రమోద్, లింగన్న, బాషిత్ ఖాన్, మేఘనాథ్, అక్బర్ తదితరులు పాల్గొని ఆదూరి అశోక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: