బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

‘జన నాయకుడు’ పెద్ధి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

Homeతెలంగాణ

‘జన నాయకుడు’ పెద్ధి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

‘జన నాయకుడు’ పెద్ధి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకున్న నేతలు నర్సంపేట, అక్టోబర్ 16(మల

బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి
ప్రపంచ ఆహార దినోత్సవం: ఎల్‌నినో ముప్పు.. పంట విరామం నుంచి ఆహార భద్రత వరకు!
మరిపెడలో అమృత్ పైపులైన్ పనుల పరిశీలన

‘జన నాయకుడు’ పెద్ధి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకున్న నేతలు

నర్సంపేట, అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి జీవిత చరిత్ర ‘జన నాయకుడు’ పుస్తకాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం పుస్తకాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు అందజేశారు.

ప్రముఖ సామాజిక రచయిత, యువ సాహిత్య రత్న కడియాల సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో పెద్ది సుదర్శన్ రెడ్డి బాల్యం, విద్యాభ్యాసం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్ర, రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ వంటి అంశాలను వివరంగా పొందుపరిచారు.

2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషితో పాటు, నల్లబెల్లి జడ్పీటీసీగా, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా, 2018–2023 మధ్య నర్సంపేట ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలను ఈ పుస్తకంలో వివరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నల్లబెల్లి మండల నాయకులు, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సర్పంచ్‌ మూర్తి, మనోహర్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుస్తక రచయిత కడియాల సురేష్ కుమార్‌ను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: