11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జ
11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం
మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో స్థానిక ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన మోటార్ను శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు.
వార్డులో ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా అందించడంతో పాటు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు మోటార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ సత్యవతి యుగంధర్, మాజీ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, భాషిపంగు రవికాంత్, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు భాషిపంగు సైదులు, మున్సిపల్ బాధ్యుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS