కార్మిక సమస్యలపై 26న చలో హైదరాబాద్ -సిఐటియు నాయకులు కొండ ఉప్పలయ్య నమస్తే భారత్ :-మరిపెడ కార్మిక సమస్యల పరిష్కారానికి 26న హైదరాబాద్ కు భారీగ
కార్మిక సమస్యలపై
26న చలో హైదరాబాద్
-సిఐటియు నాయకులు
కొండ ఉప్పలయ్య
నమస్తే భారత్ :-మరిపెడ
కార్మిక సమస్యల పరిష్కారానికి 26న హైదరాబాద్ కు భారీగా తరలిరావాలని సిఐటియు జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య అన్నారు. శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలోని సిఐటియు వాల్ పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూయాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, కార్మిక సమస్యల పరిష్కారానికి సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కు తరలి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొనాలని కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భవన నిర్మాణం కార్మిక సంఘం (సిఐటియు) మండల ప్రధాన కార్యదర్శి కొండ వెంకన్న, నాయకులు జినక సైదులు, జామ్మూర్తి, సుంకర వెంకన్న, బీకు, తప్పట్ల ముత్తు లింగయ్య, జల్లి వెంకన్న, బిక్షం, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు

COMMENTS