బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రాంరెడ్డి సరోత్తం రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Homeతెలంగాణ

రాంరెడ్డి సరోత్తం రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

రాంరెడ్డి సరోత్తం రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ

మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులో అన్నప్రసన్న కార్యక్రమం
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

రాంరెడ్డి సరోత్తం రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తం రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు.మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల బాధ్యతలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓటర్లను నేరుగా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్, మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునికంటి కమలాకర్, జిల్లా నాయకులు నూకల అభినవ రెడ్డి, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: