బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్

Homeతెలంగాణ

నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్

నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్   పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నర్సంపేట, అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భార

*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి*
ఆధారాలు లేకుండా విద్యా వ్యవస్థపై నిందలు మోపడం దారుణం ఖానాపురం ఎంఈఓ వెంకట్రామ్
కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసముద్రంలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి వేడుకలు

నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్

 

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

నర్సంపేట, అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్) :

నర్సంపేట నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చేయాలనుకున్న అభివృద్ధి పనులను దగ్గరుండి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన నర్సంపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమకారుడు, ఓరుగల్లు ఉద్యమ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా పెద్ది స్వప్నతో పాటు జిల్లా, రాష్ట్ర నాయకత్వం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకుడు మరణించినప్పుడు ఆయన కుటుంబానికి అండగా నిలిచి, వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

రాబోయే రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయం కూడా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడమేనని కేటీఆర్ పేర్కొన్నారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టే అంశాన్ని ప్రస్తావించారు.

నర్సంపేట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: