బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన డీఎంహెచ్వో డాక్టర్ వాణీశ్రీ

Homeతెలంగాణ

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన డీఎంహెచ్వో డాక్టర్ వాణీశ్రీ

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన డీఎంహెచ్వో డాక్టర్ వాణీశ్రీ నమస్తే భారత్ :-జనగామ భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీ

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు
*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*
ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన డీఎంహెచ్వో డాక్టర్ వాణీశ్రీ

నమస్తే భారత్ :-జనగామ

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ (మై భారత్ ) నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026–27 కార్యక్రమ పోస్టర్‌ను జనగామ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డీఎంహెచ్వో డాక్టర్ వాణీశ్రీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ప్రజాస్వామ్య విలువలు, దేశ నిర్మాణం మరియు జాతీయ అభివృద్ధిలో చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమం నవంబర్ 4, 2026న జనగామలోని టి టి డబ్లు ఆర్ డి సి (గర్ల్స్ ) కళాశాలలో నిర్వహించబడుతుంది. 18–25 సంవత్సరాల యువతీ యువకులు వన్ నేషనల్ – వన్ ఎలక్షన్ అనే అంశంపై మూడు నిమిషాల పాటు తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.ఈ కార్యక్రమంలో డా. మల్లికార్జున్, డా. శ్రావ్య, శ్రేయ మరియు మై భారత్ వాలంటీర్లు ఎలమకంటి సందీప్, రాజు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: