బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు

Homeతెలంగాణ

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు పాపన్నపేట, సెప్టెంబర్ 05:(నమస్తే భారత్) మండల కేంద్రంలోని శ్రీ విద్యా పాఠశాలలు ఉపాధ్య

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అంతర్గత రోడ్ల అభివృద్ధికి యుగంధర్ రెడ్డి కృషి
సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు

పాపన్నపేట, సెప్టెంబర్ 05:(నమస్తే భారత్)

మండల కేంద్రంలోని శ్రీ విద్యా పాఠశాలలు ఉపాధ్యాయుల దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ముఖ్య లక్షమని ఆయన పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను ప్రిన్సిపల్, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల పీటీలు, నిఖిత, కృష్ణ ఉపాధ్యాయులు జ్యోతి ప్రధాన్,విలాస్, ఆర్గిల్, వసుంధర,ఇందిరా, సుజాత, వనజ, గౌతమి, స్రవంతి, అశ్విని, నిర్మల, సునీత, ప్రియాంక, విజయ, దుర్గ, లావణ్య, షీలా, అనురాధ, పల్లవి, అపూర్వ, స్నేహ, కల్పన, తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: