బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం

Homeతెలంగాణ.

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది.భావితరాల భవిష్యత్తును నిర్మించే మహోన్నత బాధ్యత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అ

స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం
మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.
జర్నలిస్టు పోతుల గోవర్ధన్ తల్లి మృతి.. సీపీఐ నేత నివాళి

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది.భావితరాల భవిష్యత్తును నిర్మించే మహోన్నత బాధ్యత

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అబ్బూరి సునీల్ కుమార్

నమస్తే భారత్ :-మరిపెడ

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకితభావంతో సేవలందిస్తూ, విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించిన గంట్ల కవిత కు యంపీపియస్ సీతారాంపురం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశానికి గుగులోత్ అర్జున్ సభా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సీతారాంపురం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు సునీల్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, సమాజానికి మార్గనిర్దేశం చేసే పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో అందించే జ్ఞానం ఒక విద్యార్థి జీవితాన్నే కాకుండా, రేపటి సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు.విద్యార్థుల్లో విద్యతో పాటు క్రమశిక్షణ, మానవీయ విలువలు, సామాజిక బాధ్యత, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు కవిత చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఆమె సేవలకు లభించిన గౌరవప్రదమైన గుర్తింపుగా పేర్కొన్నారు.ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలను మాత్రమే బోధించడు.జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్పిస్తాడు అని కొనియాడారు. కవిత సేవలు మరెందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆమెను అభినందించిన వారిలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మంగీలాల్,లింగాల మహేష్ గౌడ్, వెంకటేశ్వరరావు,సందీప్, ఆదిలక్ష్మి,సారిక,విద్యార్థిని విద్యార్థులు తదితరు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: