ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ నమస్తే భారత్ :-తొర్రూరు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు, తహసిల్
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ
నమస్తే భారత్ :-తొర్రూరు
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు, తహసిల్దార్ గడీల శ్రీనివాస్ లు తెలిపారు.డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
బతుకమ్మ సందర్భంగా మహిళ ఉద్యోగులంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడారు. మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు.
మాట్లాడుతూ.పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని సంప్రదాయ పండుగలన్నింటిలో ప్రత్యేకమైనదని అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి అద్దం పడుతూ ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ హరిప్ హుస్సేన్, హౌసింగ్ ఏఈ లు యామిని, బిందు, సర్పంచ్లు సంకేపల్లి స్వాతి, మాలోత్ మౌనిక, భానోత్ రజిని,విజయ లింబ, సావిత్రి సావిత్రి సావిత్రి శ్రీనివాస్,బంగారు రమేష్, భానోత్ విద్యాసాగర్, అంగన్వాడి సూపర్వైజర్ గౌస్య, శ్రీదేవి, జిపిఓ ధరుని, అంగన్వాడి టీచర్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

COMMENTS