బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

39వ సారి రక్తదానం చేసిన స్విమ్మర్ రాజు

Homeతెలంగాణ

39వ సారి రక్తదానం చేసిన స్విమ్మర్ రాజు

39వ సారి రక్తదానం చేసిన స్విమ్మర్ రాజు తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం.. ఐదు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా రక్తదానంపై అవగాహన హనుమకొండ, అక్టో

సెప్టెంబరు 3,4 తేదీలలో సిపిఐ(ఎం) రాజకీయ  శిక్షణ తరగతులు..
పోతుల కాంతమ్మ మృతి.. కుటుంబ సభ్యులకు పరామర్శ తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల చట్టం చేసి అమలు చేయాలి

39వ సారి రక్తదానం చేసిన స్విమ్మర్ రాజు

తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం..

ఐదు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా రక్తదానంపై అవగాహన

హనుమకొండ, అక్టోబర్ 16,(మల్లేష్ నమస్తే భారత్ ) : రక్తదానం ప్రాణదానంతో సమానమని చాటుతూ వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బ్లడ్ డోనర్, బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) 39వ సారి రక్తదానం చేశారు.

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని, అక్టోబర్ 15, 2026న గురువారం యువ నేతాజీ ఫౌండేషన్, వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండలోని సుబేదారిలో ఉన్న రెడ్‌క్రాస్ భవన్‌లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన రక్తదానం చేశారు.

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామానికి చెందిన కన్నె రాజు.. కన్నె కుమారస్వామి, రామనీల దంపతుల పెద్ద కుమారుడు. రక్తదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలనే సంకల్పంతో 2005 ఆగస్టు 28న తొలిసారి రక్తదానం చేసిన ఆయన, గత 21 సంవత్సరాలుగా నిరంతరాయంగా రక్తదాన సేవలను కొనసాగిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా అవగాహన

రక్తదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటివరకు లక్ష మందికి పైగా అవగాహన కల్పించినట్లు కన్నె రాజు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం అందించేందుకు ఇప్పటివరకు 87 రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రక్తదాతల సహకారంతో 18,912 మందికి ఉచితంగా రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు.

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలోనూ ప్లాస్మాదానంపై అవగాహన కల్పించి, కరోనా బారిన పడిన 235 మందికి ఉచితంగా ప్లాస్మా అందించేందుకు కృషి చేశారు. అదేవిధంగా అవయవదానంపై మూడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి

రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని కన్నె రాజు పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతమైన అర్హత కలిగిన వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై అపోహలను వీడి, ప్రాణాలను కాపాడే ఈ మహత్తర సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

39వ సారి రక్తదానం చేసిన కన్నె రాజును ఆయన గురువులు, వరంగల్ పోలీసు ఉన్నతాధికారులు, రాగంపేట గ్రామ ప్రజలు, మిత్రులు, యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.

తన రక్తదాన సేవా కార్యక్రమాలకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులకు, వరంగల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులకు, గురువులకు, రక్తదాతలకు, యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యులకు కన్నె రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: