బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Homeతెలంగాణ

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం నమస్తే భారత్ :-తొర్రూరు అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి –
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నమస్తే భారత్ :-తొర్రూరు

అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగ నరేష్ అన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహించే పోషణ మాసంలో పోషకాహారంపై గురువారం గ్రామంలోని కర్రే భిక్య తండా అంగన్వాడి సెంటర్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగా నరేష్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవన శైలి పెంపొందించుకోవాలని కోరారు. అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వి.భారతి, బాలింతలు,గర్భిణీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: