బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌ నిరసన

Homeతెలంగాణ

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌ నిరసన

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌ నిరసన మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం :(నమస్తే భరత్) కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయినప్ప

కొందుర్గు ఎస్సై వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిచిన సిపిఐ ప్రజాసంఘాల నాయకులు
ఏళ్ల కల సాకారం.. సెయింట్ ఆగస్టీన్స్ హైస్కూల్ గల్లీ రోడ్డుకు మహర్దశ
హరిపిరా లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌ నిరసన

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం :(నమస్తే భరత్)

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పాపన్నపేటలో నిరసన చేపట్టారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పాపన్నపేట చౌరస్తా నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హామీలను అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సన్న వడ్లకు బోనస్‌ విషయంలో ఏడు రకాలకే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్‌ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు నష్టం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్‌, నాయకులు గురుమూర్తిగౌడ్‌, శ్రీనాథ్‌రావు, వెంకటేశం, దారబోయిన మల్లేశం, బాబాగౌడ్‌, కిష్టాగౌడ్‌, శ్రీనివాస్‌, బాల్‌రెడ్డి, సిద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: