బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి

Homeతెలంగాణ

ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి

ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి • మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7,(నమస్తే భరత్) గణేష్ నవరాత్

స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం.. ఆర్థిక సహాయం అందజేత
మృతి చెందిన యువకుడి కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పరామర్శ
గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట

ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి

• మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7,(నమస్తే భరత్)

గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. పాపన్నపేటలోని మంజీరా ఫంక్షన్ హాల్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల సూచనలు,నిబంధనలు పాటిస్తూ గణేష్ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రజలు,గణేష్ మండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన గణపతి మండలి సభ్యులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: