బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*

Homeతెలంగాణ

*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*

*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం* *సీపీఎం జిల్లా నాయకులు ఎన్ రాజు* నమస్తే భారత్ షాద్ నగర్ ,సెప్టెంబర్12:సిపిఎం పార్టీ మాజీ ప్రధాన కా

సంకు సుగుణమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
పాపన్నపేట…22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలి
ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*

*సీపీఎం జిల్లా నాయకులు ఎన్ రాజు*

నమస్తే భారత్ షాద్ నగర్ ,సెప్టెంబర్12:సిపిఎం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని సీపీఎం జిల్లా జిల్లా నాయకులు ఎన్ రాజు షాద్నగర్ కార్యదర్శి శ్రీను నాయక్ అన్నారు సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని పురస్కరించుకొని సీపీఎం షాద్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగాఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు
ఈ సందర్భంగా ఎన్ రాజు శ్రీను నాయక్ మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి పోరాటాలను మరింత ఉధృతం చేయడమే సీతారాం ఏచూరి కి నిజమైన నివాళి అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో సీపీఎం కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు భుజంగ రెడ్డి చెన్నయ్య రాజు నాయక్ లలిత తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: