బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి:

Homeతెలంగాణ

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి:

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: మూడో వార్డు కౌన్సిలర్ పనుగోతు రాములు మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతగిరి శ్రీను, నమస్తే

నారాయణపేట జిల్లా
తుఫాన్ బాధితులకు అండగా మేమున్నాం
పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి:

మూడో వార్డు కౌన్సిలర్ పనుగోతు రాములు

మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతగిరి శ్రీను,

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డులో ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మూడో వార్డు కౌన్సిలర్ పనుగోతు రాములు మాట్లాడుతూ.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కువినియోగించుకునేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన పట్టభద్రులు తమ వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కును పొందాలని సూచించారు.ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ సూచనల మేరకు వార్డులోని అర్హులైన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతగిరి శ్రీను, జినుక ముత్తయ్య, జినుక ఉదయ్, బోర లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: