పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలి. విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలను ఉపసంహరించు కోవాలి. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ ర
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలి.
విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలను ఉపసంహరించు కోవాలి.
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.
నమస్తే భారత్ :-కురవి
విపరీతంగా అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కురవి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు రెండు నెలల్లోనే 13శాతం పెరిగాయని, ఎల్ నినో ప్రభావం చూపించి భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెంచే అవకాశం ఉందన్నారు. బ్లాక్ మార్కెట్ లో భారీ ఎత్తున నిల్వలను ఉంచి కృత్రిమ కొరత సృష్టించి ధరలను మరింత పెంచాలని చూస్తున్న వారిపై ఉక్కు పాదం మోపి ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు వ్యయాలు, ఆదాయలోటు సాకుతో సామాన్య ప్రజలపై 5420 కోట్ల భారాన్ని మోపడం తగదని, నవంబర్ నుండి యూనిట్ కి 30 పైసలు, డిసెంబర్ నుండి 50 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించడం.మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా సామాన్యులపై మోయలేని భారం వేయడమేనని, ఈ భారాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ..సమావేశంలో సిపిఐ మండల కన్వీనర్ బుడమ వెంకన్న, మండల సహాయ కార్యదర్శి కార్యదర్శి బుర్ర సమ్మయ్య, పార్టీ నాయకులు కన్నె వెంకన్న, దూదికట్ల సారయ్య, బొల్లం ఉప్పలయ్య, కలగూర నాగరాజు, నిలుగొండ నాగేశ్వరరావు, కాట్యాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

COMMENTS