బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః*

Homeతెలంగాణ

*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః*

*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః* *టీచర్స్ డే సందర్భంగా న్యూ పవర్ కుంగ్ అకాడమీ ఆధ్వర్యంలో గ

ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం

*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః*

*టీచర్స్ డే సందర్భంగా న్యూ పవర్ కుంగ్ అకాడమీ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం*
నమస్తే భారత్ సెప్టెంబర్ 05:షాద్ నగర్ పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ అహ్మద్ ఖాన్ అధ్యర్యంలో ఘనంగా టీచర్స్ డే జరుపుకున్నారు. ఈ సందర్బంగా కుంగ్ ఫు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి తన గురువుగారైన బాలరాజ్ మాస్టర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు తమ కోచ్ అహ్మద్ మాస్టర్, బాలరాజ్ మాస్టర్ ను ఘనంగా సన్మానించి వారి యొక్క గురుభక్తిని చాటుకున్నారు. ఈ సందర్బంగా మాస్టర్ బాలరాజ్ మాట్లాడుతూ గురువు ఎల్లప్పుడూ తన శిష్యులను ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి అని వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ తన శిష్యులపై ఉంటాయని అన్నారు. మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ సూర్యుడు లోకానికి వెలుగునిస్తే గురువు మన జీవితాలకు వెలుగునిస్తాడని అన్నారు. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి మన ఆలోచనల్లో కొత్త శక్తిని నింపి బంగారు భవిష్యత్తు కు బాటలు వేసేది గురువులే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: