దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది *న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్* *న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులకు బెల్టులు, సర్టి
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది


*న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్*
*న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్స్ ప్రదానం*
*ముఖ్య అతిధి గా పాల్గొని బెల్టులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేసిన గ్రాండ్ మాస్టర్ బాలరాజ్*
నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్16:నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని నేటి యువత దేశభక్తి పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు మాస్టర్ అహ్మద్ ఖాన్. ఈ సందర్బంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు వారి ప్రతిభని గుర్తించి వివిధ కెటగిరిలో బెల్టులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రాండ్ మాస్టర్ బాలరాజ్ పాల్గొని అర్హులైన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మాస్టర్ బాలరాజ్ మాట్లాడుతూ నేడు యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారారని భాద్యతలు మరిచిపోయారాని అన్నారు. ఇప్పటికైనా యువత చెడు వ్యాసనాలకు బానిసలుగా కాకుండా క్రమశిక్షణ, భాద్యతలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా నేడు మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండ పోయిందని మహిళా అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీ చెప్పారు కానీ ఇప్పుడు మహిళలు రాత్రి కాదుకదా పగలు కూడా స్వేచ్ఛ గా తిరిగే పరిస్థితి లేదని అన్నారు.అందుకే మహిళలు, బాలికలు ఆత్మరక్షణ కొరకు కుంగ్ ఫు, కరాటే వంటి విద్యలను నేర్చుకోవాలని వాటి ద్వారా తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విద్యల వల్ల శరీరం దృఢత్వం గా ఉండి ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండ ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరు కుంగ్ ఫు, కరాటే, లాంటి విద్యలు నేర్చుకొని తమని తాము కాపాడుకుంటూ దేశానికి మరింత సేవా చేయాలనీ అన్నారు.ప్రతి తల్లిదండ్రులు తమ విద్యార్థులకు కుంగ్ ఫు, కరాటే లాంటి విద్యాలను నేర్పాలని కోరారు. ఈ కార్యక్రమం లో కుంగ్ ఫు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

COMMENTS