బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ పట్టణంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి  మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

Homeతెలంగాణ

మరిపెడ పట్టణంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మరిపెడ పట్టణంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా

*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*
సేవా స్ఫూర్తితో ముందుకు.మేరా యువ భారత్ వాలంటీర్‌గా సందీప్
పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి.

మరిపెడ పట్టణంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కార్గిల్ సెంటర్, బస్టాండ్ సెంటర్ ప్రాంతాల్లో శనివారం కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను ఆమె స్వయంగా పరిశీలించి, ఎక్కడైనా చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా కార్గిల్ సెంటర్, బస్టాండ్ సెంటర్ వంటి రద్దీ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రైనేజీలు, రహదారి పక్కన ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
పట్టణ పరిశుభ్రత విషయంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, పారిశుధ్య పనుల్లో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. పరిశుభ్రమైన మరిపెడ పట్టణం కోసం ప్రజలు కూడా మున్సిపాలిటీకి సహకరించాలని ఆమె కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: