పొడిచన్ పల్లి పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం,
పొడిచన్ పల్లి పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం
కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం, సెప్టెంబర్ 9, (నమస్తే భారత్)
పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను పొడిచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి మాట్లాడుతూ.. అన్యభాశల నేర్చి ఆంధ్రంబు రాధానుచు సఖిలించు ఆంధ్రుడా అంటూ తెలుగు ప్రజలను చైతన్యపరిచిన మహానీయుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. తెలంగాణ యాస, భాష గొప్పతనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీటి విద్యార్థులపై ఉందన్నారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్ బి. దేవయ్య మాట్లాడుతూ.. బడి పలుకుల భాష కాదు.. పలుకు బడుల భాష కావాలి అని ఆకాంక్షించిన తెలంగాణ ప్రజాకవి కాళోజీ అని అన్నారు. నా గొడవ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై ముక్కుసూటిగా స్పందిస్తూ, తన రచనల ద్వారా ఆనాటి పాలకులను ప్రశ్నించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కాలోజీ రచించిన కవితలను ఆలపించి ఆయన సాహిత్య స్ఫూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్ గౌడ్, కె కిషన్, కె శివశంకర్, పిడి కె. మహిపాల్, కంప్యూటర్ ఆపరేటర్ పాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS