బ్రేకింగ్ న్యూస్
Loading latest news...
Homeతెలంగాణ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ ఖానాపురం వైద్యాధికారి డాక్టర్ జ్యోతి ఖానాపురం అక్టోబర్ 17( మల్లేష్ నమస్తే భారత్ ) : సద్దుల

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*
జై జవాన్ – జై కిసాన్ – జై అధ్యాపక్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ

ఖానాపురం వైద్యాధికారి డాక్టర్ జ్యోతి

ఖానాపురం అక్టోబర్ 17( మల్లేష్ నమస్తే భారత్ ) :
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రజలకు తెలుగింటి ఆడపడుచులకు ఖానాపురం పిహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ జ్యోతి
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు.
తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా సంతోషాల సిరులు కురిపించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ఆకాంక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: