బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అంతర్గత రోడ్ల అభివృద్ధికి యుగంధర్ రెడ్డి కృషి

Homeతెలంగాణ

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అంతర్గత రోడ్ల అభివృద్ధికి యుగంధర్ రెడ్డి కృషి

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అంతర్గత రోడ్ల అభివృద్ధికి యుగంధర్ రెడ్డి కృషి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్ర

*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*
వనమంతా జనం….. వన దుర్గమ్మకు నీరాజనం
మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు – 12వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అంతర్గత రోడ్ల అభివృద్ధికి యుగంధర్ రెడ్డి కృషి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో గ్రామ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అబ్బాయిపాలెం గ్రామంలో బీసీ కాలనీ కామిండ్ల వెంకన్న వెంకన్న బజార్ కు సిసి రోడ్డు పనుల శంకుస్థాపన కు యుగంధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ బోడ సోమన్న, పంచాయతీ రాజ్ ఏ ఈ అజయ్ తో కలిసి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే దర్గాల బజార్ లో సిసి రోడ్డు పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి వెంకన్న లు యుగంధర్ రెడ్డి ని, స్థానిక సర్పంచులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.కె షరీఫ్, స్థానిక వార్డు సభ్యులు జినక ఉపేందర్, శ్రీమతి నందిపాటి ఉప్పలమ్మ వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్ రాయల రవి, గ్రామ నాయకులు అలవాల శ్రీనివాస్ రావు, బెస్త సంజీవ రావు, జి నక రామ్మూర్తి, ఏక స్వామి, పరశురాములు, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: