ఇల్లు కాదు.. పేదల కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యుగంధర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మర
ఇల్లు కాదు.. పేదల కుటుంబాలకు భరోసా
ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యుగంధర్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ అబ్బాయిపాలెం గ్రామంలో గంధసిరి ఉమా ఇందిరమ్మ ఇల్లు ను శుక్రవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటి కొమ్ము యుగంధర్ రెడ్డి రుబ్బెన కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఇందిర మహిళలను అనుకున్న సమయంలో పూర్తి చేసి లబ్ధి పొందడంఅభినందనీయమని అన్నారు. కొంతమందికి ఇల్లు ఇచ్చిన ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన ఇండ్లను పూర్తి చేసుకొని ప్రభుత్వం ఇస్తున్న ఐదు లక్షల రూపాయలు లబ్ధి పొందాలని వారికి సూచించారు. అనంతరం యుగంధర్ రెడ్డిని, సర్పంచిని శాలువులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ సోమన్న, ఉప సర్పంచ్ ఎస్ కే షరీఫ్, మాజీ ఎంపీటీసీ జినక వీరయ్య, వార్డు సభ్యులు జినక ఉపేందర్, నందిపాటి ఉప్పలమ్మ, గ్రామ నాయకులు పరశురాములు, రామ్మూర్తి, సంజీవరావు, యకస్వామి, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు

COMMENTS