బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం  ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్

Homeతెలంగాణ

మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్

మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్ వేలేరు అక్టోబర్ 30(మల్లేష్ నమస్తే భారత్) : మానవాళి మనుగడకు మొక్కలే ప్రా

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్
పాఖాల అందాలను వీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
*ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిపిటి &టి డి వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం*

మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం

ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్

వేలేరు అక్టోబర్ 30(మల్లేష్ నమస్తే భారత్) : మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారమని పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల వేలేరు ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం విద్యార్థి పాలడుగుల నాని జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు మానవాళికి ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, భూమిపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. చెట్ల పెంపకం వర్షపాతం పెరగడానికి, భూగర్భ జలాల సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏటీపీ స్వజని, ఉపాధ్యాయులు వక్కల రాజశేఖర్, కిరణ్, ప్రభాకర్, సుమలత, నాగజ్యోతి, విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రి, నాగరాజు, నాని, పునీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: