*వైభవంగా ముగిసిన ఓం నమశ్శివాయ నిరంతర సప్త భజన* పాపన్నపేట, సెప్టెంబర్ 05: (నమస్తే భారత్) మండల పరిధిలోని కుర్తివాడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంల
*వైభవంగా ముగిసిన ఓం నమశ్శివాయ నిరంతర సప్త భజన*
పాపన్నపేట, సెప్టెంబర్ 05: (నమస్తే భారత్)
మండల పరిధిలోని కుర్తివాడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసం ఆఖరి వారంలో గ్రామ పెద్దలు,యువకులు, భక్తజన మండలి సభ్యుల,ఆధ్వర్యంలో నిర్వహించే ఓం నమశ్శివాయ నిరంతర తాళ సప్త:భజన, కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది ఆదివారం ప్రారంభమై ఎంతో భక్తి శ్రద్దలతో 24 గంటలు నిర్విఘ్నంగా ఏడు రోజులపాటు కొనసాగింది చివరి రోజైన శనివారం ముగింపు దైవ కార్యానికి భక్తులు స్వామివారికి జలకడవలు సమర్పించి ప్రసన్నాంజనేయ స్వామికి పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు రమేష్ శర్మ, బసవలింగప్ప, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శివ నామ స్మరణ విరమించారు అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం ఓం నమశివాయ అనే శివ నామస్మరణతో మారుమోగింది. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన మున్నూరు వెంకటేశం,శ్రీ వాణి దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి దాతలుగా
వ్యవహరించారు.ఈ సందర్భంగా,ఆలయ అర్చకులు మాట్లాడుతూ, శ్రావణ మాసంలో శివనామ స్మరణ చేసే భక్తులకు దైవ అనుగ్రహంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. శివ నామంతో సకల పాపాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని సూచించారు. భక్తితో చేసే నామస్మరణకు మించిన యజ్ఞం,యాగం మరొకటి
లేదని తెలిపారు.ఏడు రోజుల కార్యక్రన్నీ విజయవంతం చేసిన భక్తులకు గ్రామ పెద్దలకు, మరియు సహకరించిన దాతలకు, భజన మండలి మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో,, గ్రామ పెద్దలు, యువకులు, వివిధ గ్రామాల భక్తులు, భజన మండలి సభ్యులు, పాల్గొన్నారు

COMMENTS