బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం….!!

Homeతెలంగాణ

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం….!!

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం....!! మహబూబాబాద్/ సెప్టెంబర్ 11( నమస్తే భారత్ ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల

అబ్బాయిపాలెంలో కోతులను నివారించాలి.
ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదు; ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కులకు పునాది వేసే జీవన విధానం
చదువుల కోసం పంపితే.. చాకిరీ చేయిస్తారా?

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం….!!

మహబూబాబాద్/ సెప్టెంబర్ 11( నమస్తే భారత్ ) :

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సోషల్ టీచర్ యాకూబ్ అవగాహన కల్పించారు.
మోడల్ స్కూల్‌లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మట్టి విగ్రహాలు సహజసిద్ధమైనవి కావడంతో నీటిలో సులభంగా కలిసిపోతాయని, పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈసందర్భంగా విద్యార్థులు 100 విగ్రహాలను తయారు చేసి విద్యార్థులు ఉచితంగా పంపిణీ చేశారు. “మట్టి విగ్రహాలను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం”, “ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత” అంటూ నినాదాలు చేశారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవాలని పాఠశాల సిబ్బంది సూచించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ తాత నాగేశ్వరరావు, యాకూబ్, రంజిత్ కుమార్, శ్రీనివాస్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: