బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చెరుకుపల్లి రాధది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే*

Homeతెలంగాణ

చెరుకుపల్లి రాధది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే*

చెరుకుపల్లి రాధది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే* *వసతులు లేకపోతే ప్రాణాలు పోవా? పేద ప్రజల ప్రాణాలకు ప్రభుత్వానికి విలువ లేదా?* *ప్రభుత్వం తరఫున కోటి

ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం
ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి తిరుపతిరెడ్డి చేయూత

చెరుకుపల్లి రాధది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే*

*వసతులు లేకపోతే ప్రాణాలు పోవా? పేద ప్రజల ప్రాణాలకు ప్రభుత్వానికి విలువ లేదా?*

*ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందే*

*స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న పూర్తి బాధ్యత వహించాలి*

*బీఎస్పీ షాద్‌నగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి తుప్పరి కుమార్ డిమాండ్*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31;చెరుకుపల్లి గ్రామానికి చెందిన మల్లని రమేష్ కుమార్ బార్య రాధ మృతి ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ షాద్‌నగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి తుప్పరి కుమార్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మన షాద్ నగర్ కమ్యూనిటీ హాస్పిటల్ లో కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే మూడు సంవత్సరాలుగా ఉన్నప్పటికీ అక్కడ అవసరాలను విస్మరిస్తే పేద ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరుకుపల్లి రాధ మృతి కేవలం ఒక కుటుంబానికి జరిగిన నష్టం మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవస్థల బాధ్యతారాహిత్యంపై సమాజం సంధిస్తున్న ప్రశ్నగా చూడాలని తుప్పరి కుమార్ హెచ్చరించారు.

*వసతులు లేకపోతే ప్రాణాలు పోవా?*

ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు, భద్రత, తగిన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం జరిగితే దాని మూల్యం సామాన్య ప్రజలు తమ ప్రాణాలతో చెల్లించుకోవాల్సి వస్తుందా? అభివృద్ధి పేరుతో ప్రకటనలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో లేదో షాద్ నగర్ లో పని చేస్తున్న రాజకీయ పాలకులు సమీక్షించుకోవలసిన అవసరం లేదా? రాధ మృతి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడానికి సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

*ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందే*

ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే బాధ, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే చెరుకుపల్లి రాధ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పించి, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.

*స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూర్తి బాధ్యత వహించాలి*

స్థానిక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజల సమస్యలు, మౌలిక వసతులు, ప్రజల భద్రతపై ఎమ్మెల్యేకు బాధ్యత ఉంటుందని తుప్పరి కుమార్ పేర్కొన్నారు. రాధ మృతి ఘటనకు దారితీసిన పరిస్థితులపై స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు సమాధానం చెప్పాలని, సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

*బీఎస్పీ పార్టీ ప్రధాన డిమాండ్లు:*

1. చెరుకుపల్లి రాధ మృతిపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలి.
2. బాధ్యులుగా తేలిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
3. బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా తక్షణమే ప్రకటించాలి.
4. కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
5. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలి.
6. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ వసతులు, భద్రతా ప్రమాణాలను సమీక్షించాలి.

ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు.. ప్రజల ప్రాణాలు పోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే నిజమైన పాలన. పేదల ప్రాణాలకు విలువ ఇవ్వని పాలన ప్రజలకు అవసరం లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: