బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*లంబాడీల చరిత్రకు అద్దం పట్టిన ‘గోర్ ఇతిహాస్’!*

Homeతెలంగాణ

*లంబాడీల చరిత్రకు అద్దం పట్టిన ‘గోర్ ఇతిహాస్’!*

*లంబాడీల చరిత్రకు అద్దం పట్టిన ‘గోర్ ఇతిహాస్’!* *షాద్‌నగర్‌ సాయిబాబా సినిమా థియేటర్ లో ప్రత్యేక ప్రదర్శనకు విశేష స్పందన* *సినిమాను వీక్షించిన డా

నాగాలాండ్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి*
గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట

*లంబాడీల చరిత్రకు అద్దం పట్టిన ‘గోర్ ఇతిహాస్’!*

*షాద్‌నగర్‌ సాయిబాబా సినిమా థియేటర్ లో ప్రత్యేక ప్రదర్శనకు విశేష స్పందన*

*సినిమాను వీక్షించిన డాక్టర్ చందులాల్ రాథోడ్, జర్నలిస్టు మల్లికార్జున్ నాయక్*

*హాజరైన ప్రముఖులు, లంబాడీ సంఘం ప్రతినిధులు*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 15:లంబాడీ సమాజ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ‘గోర్ ఇతిహాస్’ సినిమా షాద్‌నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్‌లో గురువారం ప్రత్యేకంగా ప్రదర్శించారు. మధ్యాహ్నం నిర్వహించిన ఈ ప్రదర్శనలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, యువకులు పాల్గొని సినిమాను వీక్షించారు.లంబాడీ సమాజానికి చెందిన చారిత్రక నేపథ్యం, వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమ మూలాలు, సంప్రదాయాలు, పూర్వీకుల చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.సాయిబాబా థియేటర్‌లో కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రదర్శనలో డాక్టర్ చందులాల్ రాథోడ్, జర్నలిస్టు మల్లికార్జున్ నాయక్, డైమండ్ శివ, అరవింద్, వెంకట్, శంకర్ నాయక్, పవన్ చౌహన్, శివ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. లంబాడీ సమాజ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రానికి ఆదరణ లభించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: