బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*పడమటి ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణంలో కీలక ఘట్టం*

Homeతెలంగాణ

*పడమటి ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణంలో కీలక ఘట్టం*

*పడమటి ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణంలో కీలక ఘట్టం* *గరుడ స్థంభం, గడప రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు* నమస్తే భరత్

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం….!!
మెగా హెల్త్ క్యాంప్
వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

*పడమటి ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణంలో కీలక ఘట్టం*

*గరుడ స్థంభం, గడప రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు*
నమస్తే భరత్,, 14/10/2026/ నారాయణపేట జిల్లా, మక్తల్

పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ నూతన రాజగోపుర నిర్మాణంలో భాగంగా నిర్వహించిన గరుడ స్థంభం, గడప రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి వాకిటి లలిత దంపతులు సంయుక్తంగా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తకంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….

ఆధ్యాత్మిక సంప్రదాయానికి , భక్తి భావానికి ప్రతీకగా నిలిచే పడమటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నూతన రాజగోపుర నిర్మాణం చేపట్టడం, దీనిలో భాగంగా గరుడ స్థంభం, గడప రాయి ప్రతిష్ఠాపనతో ఆలయ నిర్మాణ పనుల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గరుడ స్థంభం, గడప రాయి ప్రతిష్ఠాపనతో రాజగోపుర నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయినట్లు మంత్రి తెలిపారు.

మక్తల్‌ పట్టణంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఆలయాల అభివృద్ధి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి నూతన రాజగోపుర నిర్మాణం చేపట్టడం ద్వారా ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంపొందించడంతో పాటు, పట్టణ ఆధ్యాత్మిక గుర్తింపును బలోపేతం చేసే దిశగా ముందడుగు పడిందని మంత్రి తెలియజేశారు.

ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించడంతో పాటు, మక్తల్‌ పట్టణ సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్‌ తరాలకు అందించేందుకు దోహదపడనున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: