నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి బాలుడి కుటుంబానికి ఫోన్లో పరామర్శించిన పట్టణ అధ్యక్షుడు రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల
నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి
బాలుడి కుటుంబానికి ఫోన్లో పరామర్శించిన పట్టణ అధ్యక్షుడు రాంలాల్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఆడుకుంటూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ ఫోన్ ద్వారా బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారికి మనోధైర్యాన్ని కల్పించారు.v

COMMENTS