దొమ్మాటి సాంబయ్యకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి హైదరాబాద్ నవంబర్ 3( నమస్తే భారత్) : కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో పన
దొమ్మాటి సాంబయ్యకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి
హైదరాబాద్ నవంబర్ 3( నమస్తే భారత్) :
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ నాయకత్వంపై అచంచలమైన విశ్వాసంతో కొనసాగుతున్న దొమ్మాటి సాంబయ్యకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీవైజెఎఫ్ ) అధ్యక్షుడు డా. జితేందర్ రావు తనుగుల కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను గుర్తించి సముచిత గౌరవం కల్పించడం కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత అని పేర్కొన్నారు.ఎంపీ టికెట్ విషయంలో తొలుత అభ్యర్థిగా ప్రకటించి, అనంతరం కావ్యకు అవకాశం కల్పించినప్పటికీ సాంబయ్య పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించారని తెలిపారు. ఎలాంటి అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకుండా పార్టీ పట్ల విధేయతను కొనసాగించడం ఆయన రాజకీయ నిబద్ధతకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన నాయకులకు పదవులు దక్కనప్పటికీ విధేయతతో కొనసాగడం సాధారణ విషయం కాదని జితేందర్ రావు అన్నారు. అలాంటి నాయకులను గుర్తించి గౌరవించినప్పుడే పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం, నిబద్ధత మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పార్టీ కోసం కష్టపడిన నాయకుల పట్ల తన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో దొమ్మాటి సాంబయ్య పేరుకు ప్రాధాన్యత ఇవ్వాలని డా. జితేందర్ రావు తనుగుల విజ్ఞప్తి చేశారు.పదవుల కోసం పార్టీని ఆశ్రయించే నాయకుల కంటే, పార్టీ కోసం పదవులను త్యాగం చేసే నాయకులే నిజమైన కార్యకర్తలని పేర్కొంటూ, దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్సీ పదవి కల్పించి సముచిత గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.

COMMENTS