బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం

Homeతెలంగాణ

శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం

శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి వరంగల్ నవంబర్ 3(మల్లేష్ నమస్తే

మతసామరస్యం వెళ్లి విరిసే విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలి
గణపతి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన అభివృద్ధి
*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం

వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి

వరంగల్ నవంబర్ 3(మల్లేష్ నమస్తే భారత్ ) :
శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి అన్నారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల మేధస్సు, సృజనాత్మకతను వెలికితీసేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సమాజహితానికి సంబంధించిన కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తానని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలకు సహకరించి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణ వివరాలను జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు జి. సుధాకర్ వెల్లడిస్తూ పాఠశాల స్థాయి పోటీలు నవంబర్ 12న, మండల స్థాయి పోటీలు నవంబర్ 21న, జిల్లా స్థాయి పోటీలు నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అన్ని పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే ఈ సృజనాత్మకత సంబరాలకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు, సీఎంఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సుధాకర్ , జిల్లా మాజీ అధ్యక్షుడు మోతె ఇంద్రసేనారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాక శ్రీనివాస్, వరంగల్ మండల కన్వీనర్, రిసోర్స్ పర్సన్ సురేష్, నర్సంపేట మండల కన్వీనర్, జిల్లా కోశాధికారి బూరుగు నవీన్, నల్లబెల్లి మండల కన్వీనర్ శ్రీధర్, రాయపర్తి మండల కన్వీనర్ కరుణాకర్, గీసుకొండ మండల కన్వీనర్, సామాజిక న్యాయ విభాగం కన్వీనర్ నీలాద్రి, దుగ్గొండి మండల కన్వీనర్ రాజయ్య, వర్ధన్నపేట కన్వీనర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.అలాగే ఖానాపురం మండలం దబ్బీర్ పేట జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల వేదికగా ఖానాపురం మండల విద్యాశాఖ అధికారి బి. వెంకట్రామ్ చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సుధాకర్, జిల్లా సోషల్ మీడియా విభాగం కన్వీనర్ ఎల్. కిష్టయ్య, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఏ. మదన్, ఎల్ .లింగారెడ్డి,ఎల్ లింగమూర్తి,టి.రాజు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: