బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అంగరంగ వైభవంగా ఎస్‌ఆర్‌జీ యూత్ అధ్యర్యంలో గణనాథుని శోభాయాత్ర

Homeతెలంగాణ

అంగరంగ వైభవంగా ఎస్‌ఆర్‌జీ యూత్ అధ్యర్యంలో గణనాథుని శోభాయాత్ర

అంగరంగ వైభవంగా ఎస్‌ఆర్‌జీ యూత్ అధ్యర్యంలో గణనాథుని శోభాయాత్ర నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారా

మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,
మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు
తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం

అంగరంగ వైభవంగా ఎస్‌ఆర్‌జీ యూత్ అధ్యర్యంలో గణనాథుని శోభాయాత్ర

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఎస్‌ఆర్‌జీ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కాలనీలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. డీజే పాటలు, ఆటపాటలు, నృత్యాలతో యువత ఉత్సాహంగా సందడి చేస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.అనంతరం మాకుల తండా పెద్ద చెరువు వద్దకు చేరుకుని భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో యువత, భక్తులు పాల్గొనడంతో చెరువు పరిసర ప్రాంతం సందడిగా మారింది.ఎస్‌ఆర్‌జీ యూత్ సభ్యులు, సీతారాంపురం కాలనీ యువత, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: