బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

Homeతెలంగాణ

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి – సిపిఎం నమస

పవిత్ర మహా పాదయాత్రకు సాదర ఆహ్వానం
పాన్ బ్రోకర్స్ మరియు జ్యువెలర్స్ వ్యాపారంలో చట్టాలు, నిబంధనలు – ప్రజల హక్కులు, వ్యాపారుల బాధ్యతలు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతిరెడ్డి

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి – సిపిఎం

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళ రాధ, ఆమె కడుపులోని శిశువు మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సిపిఎం పార్టీ షాద్‌నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ అన్నారు. కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధను ఆమె భర్త రమేష్ నిన్న ఉదయం 11 గంటల సమయంలో షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారని, సాయంత్రం వరకు ప్రసవం జరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే సాయంత్రం ఐదు గంటల సమయంలో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని, అప్పటికే తల్లి, శిశువు మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని శ్రీను నాయక్ డిమాండ్ చేశారు.
మృతదేహం ప్రస్తుతం ఎక్కడ ఉందనే విషయం కూడా తమకు స్పష్టంగా తెలియడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మృతదేహం తరలింపు, వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.
ఈ ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది పాత్రపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన వైద్యం, సకాలంలో అత్యవసర చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని శ్రీను నాయక్ తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: