బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనాలి

Home.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనాలి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం అక్టోబర్ 27 (మల్లేష్ నమస్తే భారత్) : వరంగ

మరిపెడలో అమృత్ పైపులైన్ పనుల పరిశీలన
రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన
మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనాలి

మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు

ఖానాపురం అక్టోబర్ 27 (మల్లేష్ నమస్తే భారత్) : వరంగల్‌–ఖమ్మం–నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఖానాపురం మండలంలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు కోరారు.మంగళవారం ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై పట్టభద్రులు అవగాహన కలిగి ఉండాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటరు నమోదులో పాల్గొని, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపూరి వెంకన్న, సిరిపోతుల వీరస్వామి, ఖానాపూర్ క్లస్టర్ ఇన్‌చార్జి ఆబోతు అశోక్, అన్నబోయిన శ్రీనివాస్, మద్దికాయల శ్రీను, కందిమల్ల బిక్షపతి, కత్తి సుమన్, గొడిశాల రాంబాబు, పోతరాజు దేవేందర్, బొమ్మెర మునేందర్, తోట అరవింద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: